ప్రీ వెడ్డింగ్‌లో రజినీకాంత్‌.. మరి ఇంత చీపా? | Sakshi
Sakshi News home page

Rajinikanth: ప్రీ వెడ్డింగ్‌లో రజినీకాంత్‌.. తలైవాపై నెటిజన్స్‌ ఫైర్!

Published Mon, Mar 4 2024 7:19 PM

Netizens Slams Rajinikanth For Asking A women To Move Aside Pose With His Family - Sakshi

కోలీవుడ్ సూపర్‌ స్టార్ తలైవా ఇటీవలే లాల్‌ సలామ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైనా వెట్టైయాన్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజినీకాంత్ సందడి చేశారు. తన భార్య లతా, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. 

కాగా.. వేడుకలకు వెళ్తున్న రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. అయితే ఆమెను రజినీకాంత్‌ పక్కకు వెళ్లు అనేలా తన చేతులతో సంజ్ఞ చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజినీకాంత్‌ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ నెటిజన్ రాస్తూ.. 'కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు.. కానీ పేద ప్రజలకు, అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ..' స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి.. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అంటూ కామెంట్ చేశారు. 'అదే ఆయన అసలు రంగు' అని ఒకరు రాయగా.. రజినీకాంత్ చీప్ బిహేవియర్‌' అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. 

Advertisement
 
Advertisement