చిరుత హీరోయిన్‌.. డబ్బు కోసం ఇదేం పని..? | Neha Sharma Faces Trolls Over Instagram Subscription For Exclusive Content | Sakshi
Sakshi News home page

చిరుత హీరోయిన్‌.. డబ్బు కోసం ఇదేం పని..?

Apr 30 2026 11:07 AM | Updated on Apr 30 2026 11:17 AM

Neha Sharma Faces Trolls Over Instagram Subscription For Exclusive Content

బాలీవుడ్‌ నటి నేహా శర్మ  సోషల్‌మీడియాలో విమర్శలు ఎదుర్కొంటుంది. రామ్‌ చరణ్‌ మొదటి సినిమా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత కుర్రాడు మూవీ మాత్రమే తెలుగులో చేసింది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ అయిపోయింది. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో  ప్రత్యేకమైన కంటెంట్‌ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకొచ్చింది. దీంతో యూత్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోందని ఆమెపై విమర్శలు వచ్చాయి.

నేహా శర్మను సుమారు 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఆమె ప్రత్యేకంగా షేర్‌ చేసే కంటెంట్‌ను పొందేందుకు మాత్రం 10వేల వరకు వినియోగుదారులు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. అందుకోసం నెలకు రూ. 299 చెల్లిస్తున్నారు. అంటే నెలకు రూ. 30 లక్షల వరకు ఆమె సంపాధిస్తుంది. అయితే,  ఆమె అభిమానుల్లో కొందరు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.

నేహా శర్మ ఒక ప్రతిష్టాత్మక కుటుంబానికి చెందినది కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె తండ్రి అజిత్ శర్మ రాజకీయ నాయకుడు కావడంతో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆర్థికంగా బాగానే ఉన్న నేహా.. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఎందుకు క్రియేట్‌ చేసిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నెహా శర్మపై ఒక యూజర్‌ విరుచుకుపడింది. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అంటూ.. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని కోరింది. బహుశా ఇలాంటి వారిని ప్రోత్సహించే  ప్రదేశం భారతదేశం మాత్రమే కావచ్చని అభిప్రాయ పడింది.  మరొకరు ఇలా రాశారు, "ఇది ఆమెకు సులభంగా డబ్బు సంపాదించే మార్గం. పైగా, దీనికి డిమాండ్ కూడా ఉంది. ఇది విచారకరం, కానీ వాస్తవం ఇదే." అంటూ షేర్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement