షణ్ముఖ్‌పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధార‌ణ‌ | Narsingi Police Case Registered Against Shanmukh Jaswanth In Drugs Case - Sakshi
Sakshi News home page

షణ్ముఖ్‌పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధార‌ణ‌

Published Thu, Feb 22 2024 8:40 PM

Narsingi Police Case File On Shanmukh Jaswanth - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌, అతని ‍సోదరుడు సంపత్‌ వినయ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. కొంత సమయం క్రితం షణ్ముఖ్ పై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా షణ్ముఖ , సంపత్ కలిసి గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌పై యువతీ ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. షణ్ముఖ్‌ ఇంట్లో కూడా 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను నాకు మొదట పరిచయం చేసింది షణ్ముఖ్‌నే..  మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు.

ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement