ఆయా షేర్‌... రికార్డ్‌ | Actor Nani The Paradise Movie Aaya Sher Crosses 150 Million Views In Youtube Creates New Records, Check Out Details | Sakshi
Sakshi News home page

Aaya Sher Song: ఆయా షేర్‌... రికార్డ్‌

May 27 2026 1:00 AM | Updated on May 27 2026 11:03 AM

Nani Aaya Sher From The Paradise Crosses 150 Million Views Creates New Records

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్‌’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి హిట్‌ మూవీ నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ‘ది ప్యారడైస్‌’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి నాని ఇంట్రో సాంగ్‌గా విడుదలైన తొలిపాట ‘ఆయా షేర్‌...’ కి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈపాటని అడ్డుల జంగిరెడ్డి, అర్జున్‌ చాందీపాడగా, సుధన్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈపాట తెలుగు వెర్షన్‌ 150 ప్లస్‌ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్‌ సాధించినట్లు పేర్కొని, నాని కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్‌బస్టర్‌గా ‘ఆయా షేర్‌...’ నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్‌ మీడియా, కాలేజ్‌ ఫెస్ట్స్, పబ్లిక్‌ ఈవెంట్స్, డ్యాన్స్‌ వేదికలను షేక్‌ చేస్తూ ఈపాట ఒక కల్చరల్‌ ఫెనామినల్‌గా మారింది’’ అని చిత్రబృందం తెలిపింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్‌ సాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement