రేఖా గుప్తా , బాలకృష్ణ
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (ఐఎఫ్‌ఎఫ్‌డీ) 2026’ ఉత్సవాలు ఢిల్లీలో బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో బాలకృష్ణ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య పురస్కారం) అవార్డు అందుకున్నారు.
ఐదు దశాబ్దాల కెరీర్‌లో చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందించారు నిర్వాహకులు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డు అందుకున్న బాలకృష్ణకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి ఓ ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు.


