రేసు గుర్రం వస్తోంది | Allu Arjun birthday special: Race Gurram re-release in theaters on april 08 | Sakshi
Sakshi News home page

రేసు గుర్రం వస్తోంది

Mar 27 2026 3:24 AM | Updated on Mar 27 2026 3:24 AM

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, శ్యామ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ  ప్రొడక్షన్స్‌పై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వెంకటేశ్వ రావు నిర్మించారు.

యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా 2014 ఏప్రిల్‌ 11న విడుదలై హిట్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని క్రౌన్‌ మూవీస్‌ ద్వారా ‘రేసుగుర్రం’ సినిమాని అదే రోజు రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement