పెద్ది బర్త్ ‍డే స్పెషల్.. ఇప్పుడు చేతిలో ఉండేది బ్యాట్‌ కాదు....! | Ram Charan Peddi Movie Birthday Special Update | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్‌ బర్త్ ‍డే స్పెషల్.. టీజర్‌ రిలీజ్‌ టైమ్ ఫిక్స్.!

Mar 26 2026 6:57 PM | Updated on Mar 26 2026 7:06 PM

Ram Charan Peddi Movie Birthday Special Update

రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్‌ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

తాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్‌డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్‌ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement