
అమ్మాయిలో నేను మొదట గమనించేది, నచ్చేది తన వ్యక్తిత్వం. అలాగే నాకు ఒంటరితనం అంటే ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని వి
ఎక్కడైనా విలన్‌ను హీరో అంతం చేస్తాడు, కానీ ఇక్కడ మాత్రం విలన్‌ను కాపాడుతూ ఉంటాడు హీర. ఇలాంటి వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా కస్టడీ. నాగచైతన్య, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చై. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ గురించి వెల్లడించాడు.
'ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి నా క్లాస్‌మేట్‌ను ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాం. ఆన్‌స్క్రీన్ ఫస్ట్ కిస్ ఏ మాయ చేసావె సినిమాలో జరిగింది. ఆఫ్‌స్క్రీన్‌లో ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగిందనేది చెప్పాలనుకోవడం లేదు. అమ్మాయిలో నేను మొదట గమనించేది, నచ్చేది తన వ్యక్తిత్వం. అలాగే నాకు ఒంటరితనం అంటే ఇష్టం. ఎక్కువగా ఒంటరిగా ఉంటుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. కొత్త ఆలోచనలు పుడతాయి. జీవితం మరింత బ్యాలెన్స్‌గా ఉండేందుకు అవి తోడ్పడుతాయి' అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.
ఏ మాయ చేసావె సినిమాలో చై, సమంత జంటగా నటించగా వీరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడం, దానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో పెళ్లి కూడా జరిగిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న చైసామ్ అభిమానులకు షాకిస్తూ 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాదే చట్టప్రకారం విడాకులు కూడా తీసుకున్నారు.
చదవండి: ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన రానా భార్య
కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్