
ధవళ సత్యం, మురళీమోహన్, బాబూరావు
పెదపూడి బాబూరావు ప్రధానపాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘సుప్రీమ్ వారియర్స్’. ఈ చిత్రంలో మురళీమోహన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. హరి చందన్ దర్శకత్వంలోని ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక–నిర్మాత ధవళ సత్యం క్లాప్ కొట్టారు.
మురళీమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ– ‘‘ఎన్నారై అయిన బాబూరావు సినిమాపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. నిర్మాతగా, నటుడిగా పెదపూడి బాబూరావు ఆకట్టుకోనున్నారు. ఈ ‘సుప్రీమ్ వారియర్స్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ‘‘అతడు’ సినిమాతో నాకు నటుడిగా మురళీమోహన్‌గారు జన్మనిచ్చారు. ఈ ‘సుప్రీమ్ వారియర్స్’లో మా మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.
ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చె΄్పారు పెదపూడి బాబూరావు. ‘‘తైవాన్ మీద జరిగిన దాడి తర్వాత ఈ కథ రాయడం మొదలుపెట్టాను. 8పాత్రల చుట్టూ జరిగే ఈ కథలో మురళీమోహన్‌గారిని ఇప్పటివరకు చూడనిపాత్రలో చూస్తారు. ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌లో మిలటరీ, ఆర్మీ కుటుంబాల ఎమోషన్స్‌ను చూపించనున్నాం. ఇందుకోసం దాదాపు 800 మంది ఆర్మీ కుటుంబాలను కలిశాం’’ అని తెలిపారు హరిచందన్.