కోలీవుడ్ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిస్టర్ ఎక్స్.. దర్శకుడు మను ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. కోలీవుడ్‌లో ఎఫ్‌ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుండటంతో బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ ఎక్స్ కథను గతంలో ఒకసారి మీడియాతో పంచుకున్నారు. 1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించామన్నారు. 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రమని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్‌ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు.


