ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌ డే ధనుష్‌’ | Movie Celebraties Wish To Hero Danush Birthday | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌ డే ధనుష్‌’

Jul 28 2020 1:08 PM | Updated on Jul 28 2020 1:13 PM

Movie Celebraties Wish To Hero Danush Birthday - Sakshi

తమిళ హీరో ధనుష్‌ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌, బాలీవుడ్‌లోను మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ధనుష్‌లో నటుడితో పాటు కథకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆయన నేడు (జూలై 28) 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ధనుష్‌ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో ఆయనకు బర్త్‌డే విషెష్‌ తెలియజేశారు. దీంతో ‘అసురన్‌’, ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్‌’ హ్యాష్‌ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌ అవుతున్నాయి.

‘హ్యాపీ బర్త్‌డే మై బ్రో.. మరో అద్భుతమైన సంవత్సరంలోకి అడుగుపెడున్నారు’ అని సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ ట్విటర్‌లో ధనుష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ‘హ్యాపీబర్త్‌ డే ధనుష్‌, మీరు చాలా ప్రేమ, అదృష్టాన్ని పొందాలి’ అని హీరోయిన్‌ జెనిలియా ట్విటర్‌లో విష్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్‌, మరో అద్భుతమైన ఏడాదిలో అడుగుపెతున్నారు’ అని హీరోయిన్‌ కాజల్‌‌ బర్త్‌డే విషెష్‌ తెలియజేశారు. మలయాళ హీరో టోవినో థామస్‌ ధనుష్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి బర్త్‌డే విషెష్‌ తెలియజేశారు. 

వీరితో పాటు మెహ్రీన్ పిర్జాదా‌, ఐశ్వర్య రాజేష్‌, విష్ణు విశాల్‌, సంతోష్‌ నారాయన్‌ ట్విటర్‌లో ధనుష్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ధనుష్ ప్రస్తుతం తన నటించిన ‘జగామే తంతిరామ్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ధనుష్‌ నటించే బాలీవుడ్ చిత్రం ‘అట్రాంగి రే’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement