
ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో దేవ అనే పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘కుబేర’ సినిమా కొత్తపోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ యాక్టర్‌గా కెరీర్‌ని మొదలు పెట్టి, శనివారం (మే 10)కి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘కుబేర’ కొత్తపోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.