Mohanlal: దృశ్యం సిరీస్​ కాంబో రిపీట్​.. నేరుగా ఓటీటీలో విడుదల ?

Mohanlal 12th Man Movie Will Release In OTT - Sakshi

Mohanlal 12th Man Movie Will Release In OTT: ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం '12th మ్యాన్'​. మిస్టరీ థ్రిల్లర్​ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జేసెఫ్​ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

అయితే ఈ క్రమంలో ఒక వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. '12th మ్యాన్'​ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారని కోలీవుడ్​ టాక్​. త్వరలో ఈ విషయానికి సంబంధించిన ప్రకటనను అఫిషియల్​గా అనౌన్స్​ చేయనున్నారని ఆ వార్త సారాంశం. మార్చిలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఈ చిత్రం స్ట్రీమింగ్​ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్​లో ఇదివరకూ వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంత హిట్​ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ​  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top