'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్‌రాజు, బండ్ల గణేశ్, వివి. వినాయక్, మెహర్ రమేశ్, వశిష్ట తదితరులు హాజరయ్యారు. మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల, నిహారిక సైతం ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. తను కూడా పూజా కార్యక్రమంలో తళుక్కుమని మెరిసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నాడు.
#KVNTeluguDebut - #Mega158 is going to be THE BIGGEST LAUNCH EVER in INDIAN CINEMA with three towering personalities coming together💥⚡
MEGASTAR @KChiruTweets
x
POWER STAR @PawanKalyan
x
MEGA POWER STAR @AlwaysRamCharan
Watch #ChiruBobby2 Pooja Ceremony Live now❤️🔥
--… pic.twitter.com/nt2oA36JN7— KVN Productions (@KvnProductions) May 21, 2026
A new wave of charm joins the MEGA storm 🌪️❤️🔥
Welcoming the lovely #AnaswaraRajan to the world of #Mega158 💥#KVNTeluguDebut - #ChiruBobby2 Launched Grandly 🔥
A @dirbobby Film 🪓
Megastar @KChiruTweets #VenkatKNarayana @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla… pic.twitter.com/xBmHzSlpFH— KVN Productions (@KvnProductions) May 21, 2026
చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లు పొగరుగా ప్రవర్తించారు: డ్యాన్సర్


