Meenakshi Chaudhary Gives Clarity On Romantic Scenes In Films - Sakshi
Sakshi News home page

Meenakshi Chaudhary: ఆ సీన్ అయితే ఓకే.. మరీ బోల్డ్ అంటే ఒప్పుకోను: మీనాక్షి చౌదరి

Jul 25 2023 4:03 PM | Updated on Jul 25 2023 4:11 PM

Meenakshi Chaudhary Clarity Acts In Romantic Scenes In Films - Sakshi

హిట్‌-2 సినిమాతో సూపర్ హిట్‌ సొంతం చేసుకున్న నటి మీనాక్షి చౌదరి. ఆ చిత్రం హిట్ కావడంతో వరుస ఛాన్స్‌లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తోన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  వరుస అవకాశాలు రావడంపై స్పందించింది. కెరీర్‌ ప్రారంభంలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది మీనాక్షి.

(ఇది చదవండి: అయ్యో.. ఈ సీన్‌ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ పేరు.. మళ్లీ రచ్చ!)

మీనాక్షి మాట్లాడుతూ..' నేను చాలా స్క్రిప్టులు వింటున్నా. కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలే చేయాలి. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఏ భాషలో అయినా గొప్ప సినిమాల్లో అవకాశం వస్తే అది నాకు దక్కిన గౌరవమే. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నా.' అని అన్నారు. అంతే కాకుండా వెండితెరపై రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై మీనాక్షి స్పందించింది. 

మీనాక్షి మాట్లాడుతూ..' నాకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి సీన్స్ చేయను. అలా చాలా అవకాశాలొచ్చనా కూడా తిరస్కరించా. కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నా. అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఫిక్సయిపోయా. అలాగే కొత్త పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెనకాడను. విభిన్న పాత్రల్లో నటించాలనేదే నా అభిప్రాయం.' అంటూ నిర్ణయాన్ని చెప్పింది. కాగా.. ప్రస్తుతం మహేశ్‌ బాబు మూవీ గుంటూరు కారంతో పాటు విశ్వక్ సేన్, వరుణ్‌ తేజ్‌ సినిమాల్లో నటిస్తోంది. 

(ఇది చదవండి: ఆ హీరోతో 'లైగర్' బ్యూటీ షికార్లు.. ఆమె మాజీ బాయ్ ఫ్రెండేమో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement