Manchu Vishnu: 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెడుతున్నా: మంచు విష్ణు

Manchu Vishnu Said He Will Be Takes Action Against 18 Youtube Channels - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇక ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

చదవండి: మహేశ్‌ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జిన్నా మూవీ ప్రెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. ‘అక్టోబర్ 21న జిన్నా మూవీని రిలీజ్ చేయబోతున్నాం. అక్టోబర్ 5న ట్రైలర్‌ రిలీజ్ చేస్తాం. నాకు అక్టోబర్ 21 ఎంతో స్పెషల్ డే’ అని చెప్పాడు. అనంతరం తన కుటుంబంపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై విష్ణు స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని, మీడియా పెరగడం, కొత్తవాళ్లు రావడంతో సైడ్‌ ట్రాక్‌ పట్టిందన్నాడు. ఆ తర్వాత తన తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రలర్స్‌పై సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేశానని చెప్పాడు.

చదవండి: మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌

‘ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించాను. త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మ‌గ్ర ఆధారాల‌తో ఫిర్యాదు చేస్తా. అలాగే నన్ను, నా కుటుంబాన్ని ట్రోల్‌ చేస్తున్న 18 యూట్యూబ్‌ చానళ్లపై కూడా కేసులు పెడుతున్నా. ఈ ట్రోల్స్‌ని సాధారణంగా మేం పట్టించుకోము. కానీ జవాబు దారితనం కోసం కేసులు పెడుతున్నా’ అని విష్ణు అన్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top