మోసపూరితమైన తన ఆలోచనలను అంచనా వేయలేం!: మంచు లక్ష్మి | Manchu Lakshmi Introduce Another Character in her Agni Nakshatram Movie | Sakshi
Sakshi News home page

Lakshmi Manchu: ‘మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం ఎవరితరం కాదు!’

Published Thu, Jul 28 2022 1:40 PM | Last Updated on Thu, Jul 28 2022 2:17 PM

Manchu Lakshmi Introduce Another Character in her Agni Nakshatram Movie - Sakshi

మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ వస్తున్న ఆమె నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంతో పాటు తన తండ్రి మోహన్‌ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం చిత్రంలో నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ పోస్టర్స్‌ రిలీజ్‌ చేస్తోంది మంచు లక్ష్మి.  

చదవండి: నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

ఈ క్రమంలో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పరిచయం చేసింది. ఈ సందర్భంగా పోస్ట్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చింది. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సముద్ర ఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలోని ఆయన పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.  కమిషనర్ చలపతి పాత్రలో కనిపించబోతోన్నాడు. 

చదవండి: అమెరికా వెళ్లిన కమల్‌! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement