సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి! | Malayalam Actress Lakshmika Sajeevan Dies In Sharjah Due To Heart Attack - Sakshi
Sakshi News home page

Lakshmika Sajeevan Death: తీవ్ర విషాదం.. 27 ఏళ్లకే హీరోయిన్ మృతి!

Published Fri, Dec 8 2023 3:28 PM

Malayalam actress Lakshmika Sajeevan dies in Sharjah due to heart attack - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఆమె గుండెపోటుతో కేవలం 27 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. 

అజు అజీష్ దర్శకత్వం వహించిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లక్ష్మిక సజీవన్ తన కెరీర్‌లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాల్లో నటించింది. 

Advertisement
 
Advertisement