పడవలో ఫైట్‌ | Mahesh Babu Varanasi Movie Update: Varanasi Movie Fight Scene Leaked | Sakshi
Sakshi News home page

పడవలో ఫైట్‌

Apr 15 2026 1:48 AM | Updated on Apr 15 2026 1:48 AM

Mahesh Babu Varanasi Movie Update: Varanasi Movie Fight Scene Leaked

గంగానదిలో శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు రుద్ర. విజువల్‌గా ఈ ఫైట్‌ ఏ లెవల్లో ఉంటుందనేది ‘వారణాసి’ సినిమాలో చూడొచ్చు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా ‘వారణాసి’. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్‌ కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌.

గంగానదిలో పడవలో ప్రయాణిస్తుండగా శత్రువులతో హీరో చేసే ఫైట్‌ ఇది. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌ తర్వాత ‘వారణాసి’ టీమ్‌ విదేశాలకు వెళుతుందట. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి చిన్న వీడియో లీకై, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ లీక్స్‌ పట్ల మహేశ్‌బాబు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ‘వారణాసి’ షూట్‌కి సంబంధించిన విజువల్స్‌ లీకైన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement