దర్శకధీరుడికి షాక్.. వారణాసికి తప్పని లీక్‌ల బెడద | Mahesh Babu and rajamouli Shooting set photos viral in online | Sakshi
Sakshi News home page

Varanasi: దర్శకధీరుడికి షాక్.. వారణాసి మరో లీక్‌

May 29 2026 2:40 PM | Updated on May 29 2026 2:45 PM

Mahesh Babu and rajamouli Shooting set photos viral in online

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్‌  మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకే భారీ ఈవెంట్‌ నిర్వహించారు. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

అదే సమయంలో ‍అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి లీక్‌ల బెడద తప్పడం లేదు.  ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ చిత్రీకరణ టైమ్‌లో కొన్ని సీన్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా కీలకమైన ఉగ్రభట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. దీంతో మన దర్శకధీరుడిని సైతం లీక్‌ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఫోటోలు లీక్ కావడంపై మేకర్స్ నిరాశకు గురయ్యారు. ఇకనుంచి భద్రతను కట్టుదిట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement