రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కిన హీరోయిన్‌ | Maharashtra police arrest to actress Anushka Moni mohan Das | Sakshi
Sakshi News home page

రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కిన హీరోయిన్‌

Sep 5 2025 5:42 PM | Updated on Sep 5 2025 6:43 PM

Maharashtra police arrest to actress Anushka Moni mohan Das

బెంగాలీ నటి 'అనుష్క మోనీ మోహన్ దాస్'(41) పేరు సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. బెంగాలీ సినీ పరిశ్రమలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో నటించి ఆమె గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠాణే జిల్లా పోలీసులు అరెస్ట్చేశారు. అనుష్క మోనీ(Anushka Moni mohan Das) కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్తో ఆమెను అరెస్ట్చేశారు. అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు. ఈ ఘటన బెంగాలీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.

మొదట కస్టమర్స్రూపంలో అనుష్క మోనీని పోలీసులే సంప్రదించారు. ఒక మాల్లో వారి నుంచి ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 143(3) కింద, మానవ అక్రమ రవాణాకు సంబంధించి, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది. రక్షించబడిన మహిళలను షెల్టర్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచార మూఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు ACP బల్లాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement