
టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ దిపావళీకి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లేటేస్ట్ మూవీ టైటిల్‌ను రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. బైక్‌పై శర్వానంద్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు బైకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కించునున్నారు. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
#Sharwa36 is #BIKER 🏍️🏁
May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁
Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovie
Charming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL— UV Creations (@UV_Creations) October 20, 2025