
సీనియర్ హీరో అర్జున్, సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మఫ్టీ పోలీస్. ఈ సినిమాకు దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టైటిల్ చూస్తేనే కథేంటో అర్థమవుతోంది. పోలీస్ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్‌లో సీన్స్ చూస్తే కథ మొత్తం పోలీస్ కేసుల చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అర్జున్ పోలీస్‌గా కనిపించనున్నారు. టీజర్‌లో అర్జున్, ఐశ్వర్య రాజేశ్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని జీఎస్ ఆర్ట్స్ బ్యానర్‌లో జి.అరుల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, రామ్ కుమార్, రాహుల్, ప్రియదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.