
మెగాస్టార్ చిరంజీవీ ఈ దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని తన నివాసంలో టాలీవుడ్ ప్రముఖులతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున, నయనతార సైతం పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే మనశివశంకరవరప్రసాద్‌గారు మూవీ నుంచి సూపర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మీసాల పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేయగా..యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨
Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly… pic.twitter.com/qJHpVkk9og— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025