లోకేశ్ కనగరాజ్‌ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2' | Kamal Haasan–Rajinikanth Film: Lokesh Kanagaraj Not Confirmed as Director After Coolie | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: ఆ మూవీకి లోకేశ్ డైరెక్టర్ కాదు.. వీడియోతో క్లారిటీ

Sep 17 2025 2:10 PM | Updated on Sep 17 2025 2:21 PM

Lokesh Kanagaraj Not Directing Kamal Rajini Movie

లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్. ఇతడితో సినిమా చేసేందుకు ఇతర భాషల హీరోలు కూడా రెడీ అంటున్నారు. కానీ 'కూలీ' దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ'పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త విఫలమైంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని సైడ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?

దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్‌గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్‌ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్‌తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)

అయితే లోకేశ్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు కాదని తెలిసి కొందరు తమిళ ఫ్యాన్స్ బాధపడుతుండగా.. మరికొందరు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోకేశ్ తీసిన వాటిలో చాలా గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'ఖైదీ'. దీని సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఒకవేళ లోకేశ్ గనక.. కమల్-రజినీ మూవీ తీస్తే ఈ సీక్వెల్ రావడం లేటు అయిపోతుంది. మరోవైపు లోకేశ్ కాకుండా ఈ మల్టీస్టారర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.

ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్.. హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ అనే డైరెక్టర్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఖైదీ 2'ని లోకేశ్ మొదలుపెట్టే అవకాశముంది. మరి 'కూలీ' రిజల్ట్ చూసి.. కమల్-రజినీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని పక్కనబెట్టేశారా? లేదంటే నిజంగానే లోకేశ్ పేరుని పరిగణలోకి తీసుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement