32 ఏళ్ల తర్వాత కాంబినేషన్‌ రిపీట్‌ | Lenin Pandian: TG Thyagarajan, Ilayaraja Working after 32 Years | Sakshi
Sakshi News home page

32 ఏళ్ల తర్వాత కాంబినేషన్‌ రిపీట్‌

Apr 2 2026 8:36 AM | Updated on Apr 2 2026 10:55 AM

Lenin Pandian: TG Thyagarajan, Ilayaraja Working after 32 Years

ఒక సూపర్‌హిట్‌ కాంబో 32 ఏళ్ల తరువాత మళ్లీ కలసి పనిచేస్తోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయకాంత్‌ వంటి ప్రముఖ హీరోలతో పలు సూపర్‌ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఈయన. ఇప్పటికీ ఈ తరం నటీనటులతో చిత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి అందరికీ తెలిసిందే!

32 ఏళ్ల తర్వాత రిపీట్‌
కాగా సత్యజ్యోతి ఫిలింస్‌ త్యాగరాజన్‌, ఇళయరాజాలది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో పలు అద్భుతమైన చిత్రాలు రూపొందాయి. అలాంటి సూపర్‌ హిట్‌ కాంబో 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న చిత్రం లెనిన్‌ పాండియన్‌. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై టీజీ.త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేషన్‌ మనవడు దర్శన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

వీడియో వైరల్‌
సీనియర్‌ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగై అమరన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఆయన సరసన ప్రముఖ నటి రోజా నటించడం విశేషం. దీనికి డీడీ బాలచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే టీజీ త్యాగరాజన్‌, ఇళయరాజా తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న వీడియోను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement