దుల్కర్‌తో విభేదాలు? అందుకే దూరం పెట్టారా? హీరో ఆన్సరిదే! | Is there a Dispute between Dulquer Salmaan and Tovino Thomas | Sakshi
Sakshi News home page

Tovino Thomas: వాట్సాప్‌ చాట్స్‌ చూపిస్తా.. దుల్కర్‌ వచ్చినప్పుడు అడగండి!

Apr 1 2026 11:49 AM | Updated on Apr 1 2026 12:25 PM

Is there a Dispute between Dulquer Salmaan and Tovino Thomas

గతేడాది విడుదలైన మలయాళ మూవీ 'లోక' (తెలుగులో కొత్త లోక చాప్టర్‌:1 పేరిట రిలీజైంది) బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేసింది. కల్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డామినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ హీరోలు దుల్కర్‌ సల్మాన్‌, టొవినో థామస్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. దీనికి త్వరలోనే సీక్వెల్‌ కూడా రాబోతోంది.

దుల్కర్‌తో విభేదాలు?
అయితే ఫస్ట్‌ పార్ట్‌ ప్రమోషన్స్‌లో టొవినో థామస్‌ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. దాంతో అతడికి, దుల్కర్‌కు మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ప్రేక్షకుల్లో సందేహం తలెత్తింది. తాజాగా ఈ అనుమానాన్ని  టొవినో నివృత్తి చేశాడు. టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి. ఈ చిత్రం ఏప్రిల్‌ 10న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

ఫోన్‌ చేయమంటారా?
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లోక ఈవెంట్స్‌లో ఎవరూ మీ గురించి మాట్లాడలేదు. మీకు, దుల్కర్‌కు మధ్య ఏదైనా సమస్య ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. అందుకు టొవినో థామస్‌ స్పందిస్తూ.. నేనిప్పుడు అతడికి ఫోన్‌ చేసి అడగనా? (నవ్వుతూ) మామధ్య అలాంటి గొడవలేం లేవు. మేము ఒకరికొకరం చాలాకాలంగా తెలుసు. నేను అతడి సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. 

అప్పుడు అడగండి!
తర్వాత తన సినిమాలో విలన్‌గా నటించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమిద్దరం చాలా బాగున్నాం. కావాలంటే నేను మీకు మా వాట్సాప్‌ చాట్స్‌ కూడా చూపిస్తాను. మేమిద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇప్పుడీ వీడియో క్లిప్పింగ్‌ తనకు చూపించి ఇద్దరం నవ్వుకుంటాం. ఈ రూమర్స్‌ సృష్టించడం చాలా ఈజీ. లోక 2 వచ్చినప్పుడు మేమందరం కలిసొస్తాం. అప్పుడు ఈ ప్రశ్న అడగండి, నా గురించి వాళ్లే మాట్లాడతారు అని టొవినో థామస్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: రామాయణ సినిమా ఫస్ట్‌ రిజెక్ట్‌ చేశా: రణ్‌బీర్‌ కపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement