ఒకేసారి 20 సినిమాలు.. ఆయన అన్న ఒక్కమాట వల్ల..! | Divya Dutta signed 20 films, but then returned the Signing Amount | Sakshi
Sakshi News home page

Divya Dutta: ఒకేసారి 20 సినిమాలకు సంతకం చేసిన హీరోయిన్‌

Apr 2 2026 9:06 AM | Updated on Apr 2 2026 11:04 AM

Divya Dutta signed 20 films, but then returned the Signing Amount

ఐదు పదుల వయసుకి దగ్గర్లో ఉన్న బాలీవుడ్‌ నటి దివ్య దత్తా పెళ్లికి మాత్రం దూరంగా ఉంది. కరెక్ట్‌ పర్సన్‌ దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్‌గానే బతికేస్తానంటోంది. కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ఆచితూచి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె తన సినీప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్‌ మొదలుపెట్టాను. నా కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం వీర్‌ జారా. ఆ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో నాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. 

నాలో ఆలోచన
2007లో అనుకుంటా.. ఒకేసారి దాదాపు 20 సినిమాలకు సంతకం చేశాను. ఒకరోజు దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాను కలవడానికి వెళ్లాను. చాయ్‌ తాగుతూ మాట్లాడుకున్నాం. నేను 20 సినిమాలకు సంతకం చేశానని సంతోషంగా చెప్పాను. అతడి వైపు నుంచి ఎటువంటి రియాక్షన్‌ లేదు. ఇంతమంచి వార్త చెప్తే నీలో చలనం లేదేంటి? అని అడిగాను. నీకు డబ్బు అవసరం అంతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? అని అడిగాడు. లేదన్నాను.  అలాంటప్పుడు ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. నువ్వు మంచి నటివి, ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.

సినిమా
ఆయన మాట వినాలా? వద్దా? అనేది నా ఛాయిస్‌. నేను ఇంటికెళ్లి ఆలోచించాను. నేను సంతకం చేసిన సినిమాలనుంచి తప్పుకున్నాను. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కిచ్చేశాను. అప్పటినుంచి నాకు నిజంగా నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా దివ్య దత్త 2017లో వచ్చిన ఇరాడా మూవీకి గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈమె భాగ్‌ మిల్కా భాగ్‌, బద్లాపూర్‌, ఛావా వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా చిరైయా అనే వెబ్‌ సిరీస్‌లో మెరిసింది.

చదవండి: ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్‌ ఏమవుతుందో? 

Advertisement
 
Advertisement
Advertisement