నిర్మాతగా మారిన రవితేజ! | Krack Hero Ravi Teja Registers For New Production Company RT Works | Sakshi
Sakshi News home page

రవితేజ కొత్త బ్యానర్‌!

Feb 17 2021 9:56 AM | Updated on Feb 17 2021 11:33 AM

Krack Hero Ravi Teja Registers For New Production Company RT Works - Sakshi

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన జాబితాలో మాస్‌ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, సెకండ్‌ హీరో నుంచి ప్రధాన హీరో స్థాయికి ఎదిగాడు. మాస్‌ పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఈ మధ్యే క్రాక్‌తో క్రాకింగ్‌ హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఆయన నిర్మాతగా మారినట్లు ఫిల్మీ దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను వెలికి తీయడంతో పాటు చిన్న, మధ్య తరహా బడ్జెట్‌ సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాడట. అందులో భాగంగా ఆర్‌టీ వర్క్స్‌ పేరిట రవితేజ తన బ్యానర్‌ను రిజిస్టర్‌ చేయించినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

కాగా రవితేజ ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇతడి సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్‌ నటుడు నికితిన్‌ ధీర్‌, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 28న విడుదల కానుంది.

చదవండి:  బర్త్‌డే స్పెషల్‌: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఓటీటీ: భారీ రేటు పలికిన క్రాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement