కొరియన్‌ అమ్మాయి పాడిన 'సారంగ దరియా' పాట విన్నారా? | Korean Girl Sings Sai Pallavis Saranga Dariya Song | Sakshi
Sakshi News home page

korean Saranga dariya :కొరియన్‌ అమ్మాయి నోట సారంగదరియా పాట..

Sep 16 2021 7:47 PM | Updated on Sep 16 2021 8:21 PM

Korean Girl Sings Sai Pallavis Saranga Dariya Song - Sakshi

Saranga Dariya Song By Korean Girl: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సారంగదరియా పాట అప్పట్లో యూట్యూబ్‌ని షేక్‌ చేసింది. 'దాని కుడి భుజం మీద కడువా'.. అంటూ సాగిపోయిన ఈ పాట నెటిజన్లను ఎంతగానో అలరించింది.

సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఇప్పటికే 322మిలియన్లు(32కోట్లు)వ్యూస్‌తో దుమ్మురేపుతుంది. తాజాగా కొరియాకు చెందిన ఓ యువతి సారంగ దరియా పాటను ఆలపించి వావ్‌ అనిపించింది. అచ్చమైన తెలంగాణ యాసలో పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. తెలుగు యాసను అందిపుచ్చుకొని ఆమె పాడిన తీరు నెటిజన్లను అబ్బురపరుస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు 9లక్షలకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. 

చదవండి : సమంత ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన నాగ చైతన్య
అపోలో ఆసుపత్రికి హీరో అల్లు అర్జున్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement