‘కొరమీను’ నిరుత్సాహపరచదు: హీరో ఆనంద్‌ రవి | Korameenu Will Not Disappoint Anyone, Hero Anand Ravi Says | Sakshi
Sakshi News home page

‘కొరమీను’ నిరుత్సాహపరచదు: హీరో ఆనంద్‌ రవి

Dec 29 2022 9:00 AM | Updated on Dec 29 2022 9:00 AM

Korameenu Will Not Disappoint Anyone, Hero Anand Ravi Says - Sakshi

ఏడాది చివర్లో (డిసెంబర్‌ 31) మా ‘కొరమీను’ సినిమా వస్తోంది. ప్రేక్షకులను మా మూవీ నిరుత్సాహపరచదు’’ అని హీరో ఆనంద్‌ రవి అన్నారు. శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్‌ రవి, కిషోరి జంటగా నటించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్‌ ఈగోస్‌’ అనేది ఉపశీర్షిక. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మహేశ్వర్‌ రెడ్డి రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘ఒక డైరెక్టర్‌లా కాకుండా ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా.. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులే మా సినిమాను ప్రమోట్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు సమన్య రెడ్డి.

కొర‌మీను, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్..ఒకరికొకరు మద్దతు
ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబంధిచి కొర‌మీను, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీమ్స్ క‌లిసి ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. ఒక‌రోజు ముందుగా వ‌స్తున్న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన త‌మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొర‌మీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియ‌జేశారు. అలాగే బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్‌ని కొర‌మీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్‌, హీరోయిన్ మోక్ష హాజ‌రై త‌మ విషెష్‌ను అందించారు. ఇలా ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి. దీన్ని ఇలాగే అంద‌రూ కొన‌సాగిస్తే బావుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement