మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున | King Nagarjuna Say May 23 Is Special Date For Him, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

మే 23.. నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు : నాగార్జున

May 23 2026 12:08 PM | Updated on May 23 2026 12:14 PM

King Nagarjuna Say May 23 Is Special Date For Him, Tweet Goes Viral

మే 23వ తేదిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నాడు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున. ఆయన నటించిన మొదటి చిత్రం విక్రమ్‌ రిలీజై నేటికి(మే 23) 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

‘ మే 23.. ఈ తేదిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. మా నాన్న(అక్కినేని నాగేశ్వరరావు) గారితో పాటు నా కొడుకులతో(నాగ చైతన్య, అఖిల్‌)కలిసి నటించిన ‘మనం’  మూవీ ఇదే రోజున రిలీజైంది. ఇక ఇదే రోజు నా మొదటి చిత్రం ‘విక్రమ్‌’ కూడా విడుదలైంది. మిమ్మల్ని అలరించడానికి , మీ ప్రేమాభిమానాలు పొందడానికి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇన్నాళ్లుగా నాకు అండగా నిలిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ మే 23ని ఇలానే సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ నాగార్జున్‌ ట్వీట్‌ చేశాడు.

నాగార్జున మొదటి చిత్రం విక్రమ్‌ విషయానికొస్తే... 1986 మే 23న ఈ చిత్రం విడుదలైంది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ‘హీరో’కి తెలుగు రీమేకే ఈ చిత్రం. తొలి సినిమాతో నాగార్జునకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తూ.. ‘టాలీవుడ్‌ కింగ్‌’గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన 100వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement