శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ ప్రస్తుతం బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడలో ఈ ఏడాది సీజన్-12 నడుస్తోంది. ఈ రియాలిటీ షోపై ఇటీవల వివాదం మొదలైంది. రెండు రోజుల పాటు మూసేసిన ఈ షోను మళ్లీ ప్రారంభించారు అయితే ఈ ఏడాది రియాలిటీ షో కిచ్చా సుదీప్‌కు మరింత స్పెషల్‌గా నిలిచింది. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో సుదీప్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు.
తన భార్య ప్రియతో 24 ఏళ్ల తమ వివాహ జీవితాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. బిగ్ బాస్ వేదికపై కిచ్చా సుదీప్ సతీమణి ప్రియా ఎమోషనలయ్యారు. సుదీప్ హోస్ట్‌గా తిరిగి రావాలనే నిర్ణయం వెనక ప్రియా ప్రోత్సాహం ఉందని సుదీప్ తండ్రి వెల్లడించారు. ఈ మాటలకు ప్రియ భావోద్వేగానికి గురైంది. దాదాపు దశాబ్దం తర్వాత ప్రియ మొదటిసారిగా సుదీప్‌తో కలిసి వేదికపై కనిపించింది. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్, నాగార్జున, శ్రీమురళి, ధనంజయ, రమేష్ అరవింద్ లాంటి శాండల్‌వుడ్ ప్రముఖులు ఈ జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ಬಿಗ್ ಬಾಸ್ Grand Launch 2.0 | ಇಂದು ರಾತ್ರಿ 8 #BiggBossKannada12 #BBK12 #ColorsKannada #AdeBeruHosaChiguru #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #KicchaSudeep #ExpectTheUnexpected #CKPromo pic.twitter.com/BEsTuEYre4
— Colors Kannada (@ColorsKannada) October 19, 2025


