రెమ్యునరేషన్‌ గురించి అస్సలు ఆలోచించను: కీర్తి సురేశ్ | Keerthy Suresh Express Her Opinion On Remunaration In Movies, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: నాకు అదే ముఖ్యం.. రెమ్యునరేషన్‌ పట్టించుకోను: కీర్తి సురేశ్

Jun 29 2025 9:36 PM | Updated on Jun 30 2025 1:33 PM

Keerthy Suresh Express Her Opinion on Remunaration In Movies

కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్‌ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్‌ కామెడీ వస్తోన్న ఈ సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహిచారు. రాధికా ఎల్‌ నిర్మించిన ఈ చిత్రానికి వసంత్‌ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు సుహాస్, కీర్తి సురేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్‌ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన రెమ్యునరేషన్‌ గురించి కూడా మాట్లాడింది. నా విషయంలో పారితోషికం అనేది లాస్ట్ ఆప్షన్‌ అని చెప్పింది. తనకు మొదట కథనే చాలా ముఖ్యమని తెలిపింది. డిఫరెంట్ రోల్స్ చేయడమే నా లక్ష్యమని పేర్కొంది. ప్రతి ఒక్క సినిమాలో కొత్తగా చేయాలని ఉంటుందని కీర్తి సురేశ్ వెల్లడించింది. సినిమాలో ఛాలెంజ్‌ రోల్ చేయడం తనకిష్టమని తెలిపింది. కాగా.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూలై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement