బేబీ జాన్‌తో బాలీవుడ్‌కి...  | Sakshi
Sakshi News home page

బేబీ జాన్‌తో బాలీవుడ్‌కి... 

Published Tue, Feb 6 2024 12:20 AM

Keerthy Suresh Baby John Teaser Release - Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ ప్రస్థానం మొదలైంది. కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘బేబీ జాన్‌’ టైటిల్‌ను ఖరారు చేసి, గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బా మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎ.కాళీశ్వరన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ సమర్పణలో జ్యోతిదేశ్‌ పాండే, మురాద్‌ ఖేతని, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆల్రెడీ షూటింగ్‌ మొదలైంది. ‘బేబీ జాన్‌’ని మే 31న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. కాగా తమిళ హిట్‌ విజయ్‌ ‘తేరీ’ (2016) సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ రూపొందుతోందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. తమిళంలో ‘తేరీ’ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ ‘బేబీ జాన్‌’ సినిమాకు నిర్మాతగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఓ రాజకీయ నాయకుడి కొడుకు ఓ అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడితే, అతన్ని చంపినందుకు గాను ఓ పోలీసాఫీసర్‌ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే ‘తేరీ’ కథ అని తెలిసిందే.

Advertisement
 
Advertisement