'జన నాయగణ్‌' లీక్‌.. కావాలనే చేశారు: కమల్‌ హాసన్‌ | Kamal Haasan Response on Jana Nayagan Movie Leak | Sakshi
Sakshi News home page

జన నాయగణ్‌ లీక్‌.. ఇది కళాకారుడిపై జరిగిన దాడి: కమల్‌ ఆగ్రహం

Apr 11 2026 9:26 AM | Updated on Apr 11 2026 9:46 AM

Kamal Haasan Response on Jana Nayagan Movie Leak

దళపతి విజయ్‌ నటించిన చివరి చిత్రం జననాయగణ్‌. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌ సమస్య కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఓటీటీ డీల్‌ కూడా రద్దయింది. ఈ క్రమంలో జననాయగణ్‌ సినిమా సోషల్‌ మీడియాలో లీకవడం సంచలనంగా మారింది. ప్రారంభ సన్నివేశాలు సహా సినిమాలోని అనేక సీన్స్‌ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి.

అందుకే ఇలా..
ఈ ఘటనపై శివకార్తికేయన్‌, చిరంజీవి సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలని, తమ కష్టాన్ని గౌరవించాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్‌ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. 

ఎవరు కాపాడతారు?
ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్‌ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్‌ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

రజనీ రియాక్షన్‌
ఈ ఘటనపై రజనీకాంత్‌ సైతం స్పందిస్తూ.. 'ఇంటర్నెట్‌లో జననాయగణ్‌ రిలీజైందన్న విషయం తెలిసి షాకయ్యాను. సినిమా సంఘాలు ఇటువంటి విషయాలపై తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం పైరసీకి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు' అని ట్వీట్‌ చేశారు.

 

 

చదవండి: మా సినిమాను ధురంధర్‌తో పోల్చకండి: దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement