
'సల్మాన్ ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకోడులే' అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా ఈ యవ్వారం అంతా నమ్మేట్లుగా లేదని
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సినిమాల మీద పెట్టిన దృష్టి పెళ్లి మీద పెట్టడం లేదు. తను ప్రేమించిన హీరోయిన్స్ అందరికీ పెళ్లి అయిపోతున్నా అతడు మాత్రం చీమ కుట్టనట్లే ఉన్నాడు. అయితే సల్లూ భాయ్ మరోసారి లవ్‌లో పడ్డాడంట. ఆ అతిలోక సుందరి ఎవరా? అనుకుంటున్నారా? పూజా హెగ్డేనట!
'సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డాడు. అతడి నెక్స్ట్ రెండు సినిమాలకు కూడా పూజా హెగ్డేనే హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమపక్షులు సమయం దొరికితే చాలు కలిసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ మాట సల్మాన్ సన్నిహితులే చెబుతున్నారు' అంటూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూయర్ కమల్ రషీద్ ఖాన్(కేఆర్‌కే) ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. రేయ్, ఏంట్రా ఇది.. మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అని పూజా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 'సల్మాన్ ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకోడులే' అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా ఈ యవ్వారం అంతా నమ్మేట్లుగా లేదని మరికొందరు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.
BREAKING NEWS : New Couple in Town !!! Mega Star #SalmanKhan fell in love with #PoojaHegde !! His production house also signed her for next 2 films !! They are spending time together now a days !! Confirmed by Salman Khan close sources. pic.twitter.com/2lkNIXH3IE
— Umair Sandhu (@UmairSandu) December 7, 2022
చదవండి: నాదీ శ్రద్ధావాకర్ పరిస్థితే, ఆ నిర్మాత చంపాలని చూశాడు
కేజీఎఫ్ నటుడు కన్నుమూత