
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ ఏడాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో కల్కి ఉంది. ఈ క్రమంలో కల్కి డిలీట్ సీన్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ వెర్షన్ ప్రసారం అవుతుంది. ఇదే తేదీ నుంచి తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.