Kalki 2898 AD: మీ నగరానికి వచ్చేస్తున్న 'బుజ్జి'.. ఎందుకో తెలుసా..? | Kalki 2898 AD Robot 'Bujji' To Enter Your Home Town | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: మీ నగరానికి వచ్చేస్తున్న 'బుజ్జి'.. ఎందుకో తెలుసా..?

May 27 2024 8:11 AM | Updated on May 27 2024 1:37 PM

Kalki 2898 AD Robot 'Bujji' To Enter Your Home Town

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ మేకర్స్‌ ప్రారంభించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పాత్రతో పాటు బుజ్జి కూడా చాలా కీలకంగా ఉండనుంది. ఈ క్రమంలోనే చాలా గ్రాండ్‌గా బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

బుజ్జి అనే పేరుతో కనిపించిన ఈ వాహనం పట్ల సోషల్‌మీడియాలో భారీగా క్రేజ్‌ ఉంది. కొద్దిరోజుల క్రితం ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్‌ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా తనదైన స్టైల్లో డ్రైవ్‌ చేసి అభిమానులను మెప్పించాడు. బుజ్జికి పెరుగుతున్న క్రేజ్‌ వల్ల దానిని క్రియేట్‌ చేసిన టీమ్‌ చాలా సంతోషంగా ఉంది. 

ఈ క్రమంలో బుజ్జి అభిమానుల కోసం వారు సరికొత్త ప్లాన్‌ చేస్తున్నారట. భారతదేశంలోని కొన్ని నగరాల్లో బుజ్జి చుట్టేయనుందట. ఆ సమయంలో అభిమానులకు ఒక భారీ ఆఫర్‌ను మేకర్స్‌ ప్రకటించనున్నారు. బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్ని  వారు కల్పించనున్నారు. ఆ సమయంలో కల్కి టీమ్‌ కూడా ఉండనున్నట్లు సమాచారం. జూన్‌ 27న ఈ కల్కి విడుదల కానున్నడంతో ఇలా సరికొత్తగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ ప్లాన్‌ వేశారట. బుజ్జి పర్యటన షెడ్యూల్‌ త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement