Acharya Movie Making | Kajal Agarwal Gautam Kitchlu Took Blessings From Chiranjeevi In Acharya Movie Sets - Sakshi
Sakshi News home page

కాజల్‌- గౌతమ్‌లకు చిరంజీవి ఆశీర్వాదాలు

Dec 15 2020 1:13 PM | Updated on Dec 15 2020 7:49 PM

Kajal Agarwal Gautam Kitchlu Meets Chiranjeevi Acharya Sets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తజంట కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లూలు ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో సందడి చేశారు. మూవీ యూనిట్‌ వీరికి బొకేలతో స్వాగతం పలికారు. కేక్‌ కట్‌ చేయించి విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. దర్శకుడు కొరటాల శివ, డీఓపీ తిరు సహా పలువురు కాజల్‌, గౌతమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..)

కాగా నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో గౌతమ్‌ కిచ్లూను పెళ్లాడిన ఆమె నేడు హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో చెర్రీ అతిథి పాత్రలో మెరవనున్నారు. విద్యార్థి నాయకుడిగా కనిపించే చరణ్‌కు కియారా అద్వానీని జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. 



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement