సూపర్‌ షీ మూవీ రెడీ | Jyoti Purvaj Killer movie updates | Sakshi
Sakshi News home page

సూపర్‌ షీ మూవీ రెడీ

Oct 27 2025 2:04 AM | Updated on Oct 27 2025 2:04 AM

Jyoti Purvaj Killer movie updates

‘శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్‌ పీస్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూర్వాజ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కిల్లర్‌’. ఉర్వీష్‌ పూర్వాజ్‌ సమర్పణలో పూర్వాజ్, ప్రజయ్‌ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో జ్యోతి పూర్వాజ్‌ లీడ్‌ రోల్‌ చేశారు.  విశాల్‌ రాజ్, దశరథ, చందు, గౌతమ్‌ కీలక పాత్రల్లో నటించారు.

‘‘ఈ సూపర్‌ షీ మూవీని త్వరలో రిలీజ్‌కి రెడీ చేస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌... ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగు తున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement