చిన్ననాటి ఫొటో షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Jacqueline Fernandez Shares Adorable Picture Celebrities Comments - Sakshi

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ’బచ్చన్‌ పాండే’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న నటి జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్. ఆమె తాజాగా‌ షేర్‌ చేసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బీ టౌన్‌ సెలబ్రిటీల మనసులు దోచుకుంది. ఇట్స్‌ వీకెండ్‌‌ అంటూ ఫెర్నాండెజ్‌ బుల్లి గౌను వేసుకుని ఉన్న తన చిన్ననాటి ఫోటో షేర్‌ చేసింది. సో క్యూట్‌ అంటూ ప్రీతి జింతా, యామి గౌతమ్‌, మనీష్‌ పాల్‌, ఊర్వశి రౌతాలా వంటివారు కామెంట్లు చేస్తున్నారు. అందాల నటి అప్పుడూ, ఇప్పుడూ క్యూట్‌గానే ఉందని అభిమానులు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఫెర్నాండెజ్‌ గత డిసెంబర్‌లో ఓ హాట్‌హాట్‌ ఫొటో షేర్‌ చేసి ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. 

జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ మిర్రర్‌ సెల్ఫీ దిగుతున్న ఫొటోను ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేసిన ఆమె.. ‘కొందరు నువ్వు నువ్వులా ఉండు అని చెప్తారు. మళ్లీ వాళ్లే నువ్విలా ఉన్నావేంటి అని జడ్జ్‌ చేస్తారు. అందుకే ఎలా ఉండాలో నువ్వే ఎంపిక చేసుకో’అని క్యాప్షన్‌ జత చేసింది. దీంతోపాటు గత డిసెంబర్ 27న సల్మాన్‌ బర్త్‌డే సందర్భంగా ఫెర్నాండెజ్‌ పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. హైస్కూల్‌ వయసులో సల్మాన్‌ ఖాన్‌తో దిగిన ఫొటో అది. కాగా, 2009లో అలాదిన్‌ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె‌.. కిక్‌, రేస్‌ 3 సినిమాల్లో సల్మాన్‌తో నటించింది. కిక్‌ సీక్వెల్‌లో ఈ ఇద్దరూ మరోసారి జోడి కట్టనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top