రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్‌ సింగర్‌ | india top Singer Buys a new Apartment Worth Rs 29 Crore | Sakshi
Sakshi News home page

రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్‌ సింగర్‌

Apr 7 2026 9:17 AM | Updated on Apr 7 2026 9:17 AM

india top Singer Buys a new Apartment Worth Rs 29 Crore

నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో ఒక కొత్త విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. బాలీవుడ్‌ నివేదికల ప్రకారం, శ్రేయా ఘోషల్ తన తల్లి షమిష్ఠ ఘోషల్, తండ్రి బిశ్వజిత్ ఘోషల్‌లతో కలిసి వర్లీలో రూ.29.70 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.  ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటైన వర్లీలోని గోద్రెజ్ ట్రైలజీలో ఉంది.

రిజిస్టర్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ మొత్తం వైశాల్యం 2,750.28 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.  ఏప్రిల్ 1, 2026న అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ లావాదేవీలో  రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపుతో పాటు రూ. 30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయని సమాచారం.

‘సరిగమ’ విజేతగా కెరీర్‌ను ప్రారంభించిన శ్రేయాఘోషల్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మొదట దేవదాస్‌ చిత్రంతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గజని, 3 ఇడియట్స్‌, దబాంగ్‌, ఢిల్లీ 6, ఆషికీ-2, క్రిష్‌, పద్మావత్‌ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్‌ దక్కింది. తెలుగులో ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్‌, సీతయ్య, వర్షం, మల్లీశ్వరి, నేనున్నాను, అతడు, అదుర్స్‌, రేసుగుర్రం, మనం, ఖైదీ నం. 150,గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో పాటు సుమారు 200కు పైగానే సాంగ్స్‌ పాడింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సాంగ్‌ కోసం సుమారు రూ. 25 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement