యాక్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అన్నీ ఏఐ (Artificial Intelligence) చూసుకుంటోంది. అవును, హీరోహీరోయిన్లతో పనే లేకుండా కేవలం ఏఐను వాడుకుని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓ పోటీ కూడా పెట్టారు. అదే ఏఐ హాకథాన్. దేశంలో తొలిసారి ఈ ఏఐ హాకథాన్ జరుగుతోంది. ముంబైలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ హాకథాన్‌లో 50 మంది క్రియేటర్స్ పాల్గొననున్నారు. వీరు విడివిడిగా లేదా జట్లుగా తయారై ఏఐ టూల్స్ ఉపయోగించి షార్ట్ ఫిలింస్ రూపొందించాల్సి ఉంటుంది. పోటీ చివరిరోజు ఈ సినిమాలను ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఏఐ ఈవెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి.
చదవండి: 14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!


