ఈ సినిమా చాలా టఫ్‌గా అనిపించింది: హన్సిక

Heroine Hansika New Film 105 Minutes All Set To Release - Sakshi

‘‘నేనిప్పటివరకూ చేసిన సినిమాలన్నింటిలోకి ఈ సినిమా చాలా టఫ్‌గా అనిపించింది. అయినా మంచి సినిమా చేశానని ఆనందం దక్కింది. చక్కని కథతో నిర్మాతలు చేసిన మంచి ప్రయోగం ఈ సినిమా. కథ చెప్పినట్లుగానే దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇందులో నేను 20 నిమిషాల రెయిన్‌ షాట్‌లో పాల్గొన్నాను. ఆ షాట్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరం ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హన్సిక.

రాజు దుస్సా దర్శకత్వంలో ఒకే ఒక్క క్యారెక్టర్‌తో బొమ్మక్‌ శివ నిర్మించిన చిత్రం ‘105 మినిట్స్‌’. హన్సిక కథానాయిక. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం విలేకరుల సమావేశంలో రాజు దుస్సా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ప్రతి షాట్‌ దాదాపు ఇరవై నుండి ఇరవై అయిదు నిముషాలు ఉంటుంది. ఈ సింగిల్‌ షాట్‌ని హన్సిక సింగిల్‌ టేక్‌లో చేశారు’’ అన్నారు. బొమ్మక్‌ శివ మాట్లాడుతూ– ‘‘హన్సిక సింగిల్‌ టేక్‌లో చేయడంవల్ల ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే  పూర్తి చేయగలిగాం. చిత్రయూనిట్‌ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్‌గా వర్క్‌ చేశారు. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

చదవండి :Raja Raja Chora : పబ్లిసిటీ కోసం అలా మాట్లాడలేదు : శ్రీవిష్ణు
పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top