
హీరోలు వారి స్వార్థం కోసం సంగీతాన్ని చంపేస్తున్నారు అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి (Kunal Kohli). ఐటం సాంగ్స్ ఉంటే చాలని ఫీలవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కథానాయకుల తీరును ఎండగట్టాడు. అదే సమయంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా డెబ్యూ సినిమా 'సైయారా'కి పాటల వల్లే మంచి బజ్ వస్తుండటంపై ప్రశంసలు కురిపించాడు.
ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టా?
'ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలను తగ్గించడం కోసం హీరోలు సంగీతాన్ని చంపేస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టు పాటలని ఫీలవుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు (జూలై 18న సైయారా మూవీ రిలీజ్) ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. మంచి సినిమాలు, వినసొందపైన సంగీతం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఆల్బమ్స్‌కు మంచి రోజులు రానున్నాయ్.
హీరోలకు హక్కు లేదు
సినిమా గురించి, అందులోని పాటల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సింది హీరోలు, వారి మేనేజర్లు కాదు.. కేవలం దర్శకనిర్మాతలకు మాత్రమే ఆ హక్కు ఉంది! సరికొత్త మార్పునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అన్నాడు. బాలీవుడ్‌లో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన కునాల్ తెలుగులో నెక్స్ట్ ఏంటి? మూవీ తీశాడు.
పాటలతోనే మంచి బజ్
సైయారా మూవీ విషయానికి వస్తే ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తనిష్క్ బగ్చి, అర్స్‌లన్ అబ్దుల్లా, ఫహీం నిజామి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ మూవీకి విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. సంగీతంతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.
All have had HIT music. Today’s heroes have killed music by wanting to reduce the role of heroines and thinking that item songs are hit songs. Tmrw is a legendary day in indian cinema. The change has begun. Good films. Good music are back. Albums. Complete albums. Filmmakers not… https://t.co/vyPNqyioZ2
— kunal kohli (@kunalkohli) July 17, 2025