కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో హీరో సూర్య! | Hero Suriya Plays Cameo In Kamal Haasan Vikram Movie | Sakshi
Sakshi News home page

Suriya-Kamal Haasan: కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో హీరో సూర్య!

May 13 2022 8:06 AM | Updated on May 13 2022 8:07 AM

Hero Suriya Plays Cameo In Kamal Haasan Vikram Movie - Sakshi

కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ వంటి స్టార్స్‌ కూడా నటించారు. ముగ్గురు హీరోలు నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించనున్నారని కోలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌.

ముఖ్యమైన అతిథి పాత్రలో సూర్యని చూపించనున్నారట లోకేష్‌. ఇటీవల ‘విక్రమ్‌’ షూటింగ్‌ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్‌ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement