హత్యా? ఆత్మహత్యా?

Hero Sree Vishnu Launched the Trial Movie Trailer - Sakshi

స్పందన పల్లి, యుగ్‌ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్‌ ఫిల్మ్‌ ‘ది ట్రయల్‌’. రామ్‌ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్‌’ ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది.

రామ్‌ ఈ సినిమా కథను బాగా డీల్‌ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రూప, ఆమె భర్త అజయ్‌ ఓ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్‌ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top