నటిపై అత్యాచారం.. హలీవుడ్‌ మొఘల్‌కు మరో 16 ఏళ్ల జైలు శిక్ష

Harvey Weinstein Sentenced To 16 Years In Actress Molestation Case - Sakshi

హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్‌ నటిపై బెవర్లీ హిల్స్‌ హోటల్‌ గదిలో అఘాయిత్యానికి పాల్పడినందుకు లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్‌ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు అంటే తన జీవితకాలం జైల్లో ఊచలు లెక్కిస్తూ గడపాల్సిందే.

వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత.. దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి తాను అర్హుడిని కాదని.. ఈ కేసులో చాలా లోసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నపించాడు. అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్‌.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్‌ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్‌లోనే లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే.

బాధితురాలైన నటి వైన్‌స్టీన్‌ను వీలైనంత గరిష్ట శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జి ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని తెలిపింది.  తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లోనే ఉన్నా సరిపోదని అన్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్‌లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్‌ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్‌, జెన్నిఫర్‌ ఐన్‌స్టన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీశాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top