నీ రాక అనివార్యం హనుమా..విజువల్‌ వండర్‌లా ‘హను-మాన్‌’ ట్రైలర్‌ | Prasanth Varma And Teja Sajja HanuMan Movie Official Trailer Out, Watch Video Inside - Sakshi
Sakshi News home page

HanuMan Movie Trailer Highlights: నీ రాక అనివార్యం హనుమా..విజువల్‌ వండర్‌లా ‘హను-మాన్‌’ ట్రైలర్‌

Published Tue, Dec 19 2023 12:28 PM

HanuMan Movie Trailer Out - Sakshi

తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్‌’. ఫస్ట్‌ ఇండియన్‌ ఒరిజినల్‌ సూపర్‌ హీరో మూవీ ఇది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న  రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి  ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌.  పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌..  అద్భుతమైన విజువల్స్‌తో  ట్రైలర్‌ అదిరిపోయింది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్‌ వర్మ ఎక్కడా రాజీ పడనట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

‘యతో ధర్మ స్తతో హనుమ..యతో హనుమ..స్తతో జయ’అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. పల్లెటూరిలో ఉండే హీరోకి ఒక స్పెషల్‌ పవర్‌ ఉండడం.. విలన్‌(వినయ్‌ రాయ్‌) ఆ పవర్‌ కోసం ప్రయోగాలు చేయడం.. హీరో గురించి తెలిసి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తే హనుమంతుడు ఎలా కాపాడాడు? అసలు హీరోకి ఉన్న స్పెషల్‌ పవర్‌ ఏంటి? మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

‘పోలేరమ్మ మీద ఒట్టు..నా తమ్ముడి మీద చేతులు పడితే ఒక్కొక్కరికి టెంకాయలు పగిలిపోతాయి’ అని వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ చేసే ఫైట్‌ సీన్‌ ట్రైలర్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌. ‘నీకు కనబడుతుంది ఒకడి ఉన్మాదం మాత్రమే కానీ దాని వెనుక ఒక ఉపద్రవం దాగిఉంది’, ‘కలియుగంలో ధర్మంకోసం పోరాటే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంటా ఉన్నాడు..మానవాళి మనుగడను కాపాడుకోవడం కోసం నీ రాక అనివార్యం హనుమా’ లాంటి డైగాల్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.

Advertisement
 
Advertisement